శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం..! 1 d ago
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని దేవస్ధానం అధికారులు తెలిపారు. 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. సోమవారం శ్రీవారిని 54,180 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.20 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.